Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరలక్ష్మీ వ్రతం... సప్తముఖ రుద్రాక్షను ధరించి పూజచేస్తే?

వరలక్ష్మీ వ్రతం.. శుక్రవారం (ఆగస్టు 24) వస్తోంది. ఈ శుభదినాన వివాహిత మహిళలు ఉపవాసం వుండి.. వరాలనిచ్చే వరలక్ష్మిని పూజించాలి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం వరలక్ష్మిని ఆ రోజున ఇంట పూజించాలి. పాలు, పండ్లు

Advertiesment
వరలక్ష్మీ వ్రతం... సప్తముఖ రుద్రాక్షను ధరించి పూజచేస్తే?
, సోమవారం, 20 ఆగస్టు 2018 (15:27 IST)
వరలక్ష్మీ వ్రతం.. శుక్రవారం (ఆగస్టు 24) వస్తోంది. ఈ శుభదినాన వివాహిత మహిళలు ఉపవాసం వుండి.. వరాలనిచ్చే వరలక్ష్మిని పూజించాలి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం వరలక్ష్మిని ఆ రోజున ఇంట పూజించాలి. పాలు, పండ్లు తీసుకుని.. ఆహారం తీసుకోకుండా ఉపవాసం వుండాలి. ఇంట్లోనైనా లేకుంటే ఆలయాల్లో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనవచ్చు. 
 
ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి.. శుచిగా స్నానమాచరించి.. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. వరలక్ష్మీ దేవిని పూజించాలి. ఎరుపు రంగు పువ్వులు, తామర పువ్వులతో ఆమెను అర్చించాలి. పూజించేటప్పుడు సప్త ముఖ రుద్రాక్షలను ధరించడం మంచిది. ఈ సప్తముఖ రుద్రాక్షలను ధరించి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ  వ్రతంగా పాటిస్తాం. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి.
 
పూర్వం జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా వుందా అన్ని పరమేశ్వరున్ని అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు. పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మ‌వారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. 
 
పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది. శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది. 
 
వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్షాబంధన్ పండుగ ఎలా వచ్చిందో తెలుసా? ఆగస్టు 26న రాఖీ పండుగ