Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృషభరాశి జాతకులా.. మీకు లక్కీ ఏదో తెలుసా?

Advertiesment
Vrishabha rashi
వృషభరాశి జాతకులు డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. భోజనప్రియులైన ఈ జాతకులు నాణ్యత గల ఆహారాన్ని తీసుకోవడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీనికోసం బెస్ట్ రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుంటారు. వస్త్రాధరణ, మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
 
వాక్చాతుర్యతను కలిగివుండే ఈ జాతకులు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎలాంటి కష్టమైన ఉద్యోగమైనా ఇష్టపడి చేస్తారు. ఇతరులకు సహాయపడే గుణం కలిగిన ఈ జాతకులు క్లిష్ట పరిస్థితులను సునాయాసంగా అధిగమిస్తారు. అయితే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకుపోవాల్సి ఉంటుంది. మంచి భాగస్వామి లభించినా సర్దుకుపోయే తత్త్వం ఉండాలని పండితులు అంటున్నారు. 
 
ఈ జాతకులు మ్యూజిక్, సినిమా, ఆర్ట్, యాక్టింగ్, ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీషన్స్, ఆటోమొబైల్ డీలర్స్, బ్యాంకర్స్, టాక్స్ మేనేజర్స్‌గా రాణిస్తారు. ఈ జాతకులకు శుక్రవారం, బుధవారం, శనివారం కలిసొస్తాయి. మంగళవారం షాపింగ్‌కు వెళ్లకపోవడం మంచిది. 
 
భాగస్వామి ఎంపికకు సోమవారం బాగా కలిసొస్తుంది. అందుచేత పెళ్లి వంటి శుభకార్యాలకు సోమవారాన్ని ఎంచుకోవచ్చు. బుధవారం లవ్ ప్రపోజ్‌కు మంచి రోజు. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ప్రేయసి లేదా ప్రియురాలికి కానుకలివ్వొచ్చు. ఆదివారాల్లో ప్రయాణాలు చేయడం మంచిది కాదు. 
 
లక్కీ నెంబర్ : 6 
లక్కీ స్టోన్స్: వజ్రం, పచ్చ 
లక్కీ కలర్స్ : తెలుపు, రోజా, ఆకుపచ్చ
వృషభ రాశి జాతకులకు మిథునం, కన్య రాశుల్లో జన్మించిన వారిని భాగస్వాములుగా ఎంచుకోవడం ఉత్తమం. కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభం, వృశ్చికం రాశుల్లో జన్మించిన వారిని పార్ట్‌నర్స్‌గా ఎంచుకోవడం సాధారణ ఫలితాలను ఇస్తుంది. అయితే ధనుస్సు, తులారాశి జాతకులను మాత్రం పెళ్లాడటం మంచిది కాదు. 

Share this Story:

Follow Webdunia telugu