Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు : కందులు దానం చేయండి!

Advertiesment
Subramania swamy puja for late marriage
, శనివారం, 27 సెప్టెంబరు 2014 (16:15 IST)
వివాహం విషయంలో జాతకాలు కుదరట్లేదా..? ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆశించిన స్థాయి సంబంధం దొరక్కపోవడం వలన ... జాతకాలు కలవక పోవడం వలన ఒక్కోసారి వివాహం విషయంలో జాప్యం తప్పదు.  
 
ఏదో దోషం కారణంగానే తల్లిదండ్రులు తమ సంతానానికి వివాహంలో జాప్యం జరుగుతోందని భావించి, ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వివాహం విషయంలో ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని, వాటి నివారణకు తమవంతు కృషి చేస్తుంటారు. శీఘ్రమే వివాహం జరగడానికి అనేక పూజలు ... దానాల గురించి చెప్పడం జరుగుతోంది. వాటిలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఒకటిగా కనిపిస్తుంది.
 
విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రానికి వెళ్లి ఆ స్వామికి మనసులోని మాటను చెప్పుకోవాలి. ఆ తరువాత ఆ క్షేత్రంలో 'కందులు' దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన వివాహానికి అడ్డుపడుతోన్న దోషాలు నివారించబడతాయి. ఫలితంగా మనసుకి నచ్చినవారితో అనతికాలంలోనే వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu