Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనైశ్వర అమావాస్య-నీటితో అభిషేకం, సుందరకాండ పఠిస్తే..

శనైశ్వర అమావాస్య-నీటితో అభిషేకం, సుందరకాండ పఠిస్తే..
, గురువారం, 2 డిశెంబరు 2021 (14:47 IST)
శనైశ్వర అమావాస్య డిసెంబర్ 4న రానుంది. ఈ రోజు శనిదేవుడిని శాస్త్రోక్తంగా పూజించాలి. శనిదోషాన్ని పోగొట్టడానికి శని దేవాలయంలో నీటితో అభిషేకం చేయాలి. శనిదేవుడు హనుమంతుడి భక్తులకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించడు. అందుచేత అమావాస్య రోజు మల్లెపూవులు, దీపదానం చేయాలి. ఈ రోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల శనిదోషం కలుగదు.
 
శనైశ్వర అమావాస్య ఉపవాసం చేయాలి. శనైశ్వరునికి అభిషేకం చేయాలి. నువ్వుల నూనె, నల్ల నువ్వులు, శనిదేవాలయంలో అభిషేకానికి ఇవ్వవచ్చు. అలాగే అమావాస్య రోజు దానధర్మాలతో దేవతలు ప్రసన్నం అవుతారని మన పురాణాలు తెలుపుతున్నాయి. 
 
శనిదోషం వల్ల వచ్చే శనైశ్వర అమావాస్య పూజ తర్వాత నువ్వుల నూనె, బట్టలు ఇతర వస్తువలను దానం చేయాలి. దీంతో శని దేవుడు కరుణిస్తాడు. అలాగే నల్ల నువ్వుల కొన్ని, నీరు తీసుకుని శనిదేవుడికి అభిషేకం చేస్తూ 21  సార్లు శని మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల శని దుష్పరిణామాలు దూరమవుతాయి.
 
శని అమావాస్య 2021 శని అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపు డెక్కను ఏర్పాటు చేయాలని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లైతే షాప్ వద్ద హార్స్ షూ కూడా ఉంచవచ్చు. ఇది వ్యాపారంలో ఎదుగుదలకు దారితీస్తుంది.
 
శనిదేవుడు న్యాయానికి దేవుడు. వారు న్యాయాన్ని ప్రేమిస్తారు. శని అమావాస్య రోజున దానం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. అంతేగాకుండా శనివారం నాడు మీరు కిచిడి,  ఆవనూనె, గొడుగు, నల్ల నువ్వులు, నల్ల బూట్లు మరియు దుప్పట్లు మొదలైన వాటిని దానం చేయవచ్చు.
 
శని అమావాస్య రోజున పేదలు, నిస్సహాయులు, అవసరమైన వారికి ఆహారం మరియు నీటిని దానం చేయడం కూడా మంగళకరంగా పరిగణించబడుతుంది. దీని కోసం అమావాస్య రోజున మీరు పేదవారికి, బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వాలి. అంతేకాకుండా, శనివారాల్లో ఆవాల నూనె, ఒక రూపాయి నాణెం ఒక కంటైనర్ లో వేసి ముఖం చూడండి. తరువాత నూనె దానం చేయడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడుస్తున్నారా?