Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : 04-11-17నాటి దినఫలాలు

మేషం : ఉద్యోగరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. స్త్రీలకు ఆభరణాలు, విలువైన వస్తువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే

Advertiesment
శుభోదయం : 04-11-17నాటి దినఫలాలు
, శనివారం, 4 నవంబరు 2017 (08:41 IST)
మేషం : ఉద్యోగరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. స్త్రీలకు ఆభరణాలు, విలువైన వస్తువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. మీ హుందాతనం, మాటతీరు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం : మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. బకాయిలు, ఇంటి అద్దెలు తదితర వసూళ్లలో లౌక్యంగా మెలగండి. ప్రింటింగ్ రంగాల వారికి సమర్ధులైన పనివారలు దొరకటం కష్టం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.
 
మిథునం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. అగ్రిమెంట్లు, చెక్కుల జారీలో మెలకువ వహించండి. మిమ్ములను పొగిడిన వారే విమర్శించేందుకు వెనుకాడరు. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చ నీయాంసమవుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
కర్కాటకం : మంచిమాటలతో ఎదుటివారిని మీ వైపునకు తిప్పుకోవటానికి యత్నించండి. వ్యాపార, వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. అలవాటు లేని పనులు, శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
సింహం : వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు లోన్ మంజూరు కాగలదు. స్వయం కృషితోనే బాగా రాణిస్తారు. వైద్య రంగాల వారు అరుదైన శస్త్రచికిత్సలను సమర్థంగా నిర్వహిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. పరిచయాలు, వ్యాపకాలు అధికం.
 
కన్య : ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారుల గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణ బాధల నుంచ విముక్తి పొందటంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికం.
 
తుల : ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మా ఆలోచనలుంటాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. హోల్‌సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో చెక్కుల జారీలో ఏకాగ్రత వహించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ ఇబ్బందులను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది.
 
వృశ్చికం : వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులు బదిలీపై వెడుతున్న అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. విదేశీయానం, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్య సేవలు అవసరమవుతాయి.
 
ధనస్సు : వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. నూతన ప్రాజెక్టులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తేనే కాని అనుకున్న పనులు పూర్తి కావు. పుణ్యక్షేత్ర సందర్శనలు, దైవదీక్షల పట్ల ఆసక్త నెలకొంటుంది. స్త్రీలతో మిత సంభాషణ క్షేమదాయకం. ధనం ఏ మాత్రం పొదుపు చేయలేరు.
 
మకరం : ప్రైవేటు ఫైనాన్సుల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక నిరుత్సాహం చెందుతారు. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సంఘంలో గౌరవం పొందుతారు.
 
కుంభం : మీ కొచ్చిన కష్టానికి సానుభూతి చూపే వారే కాని సహాయం చేసే వారుండరు. కళ, క్రీడ, కంప్యూటర్ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల సమర్థత, సమయ పాలన అధికారులను ఆకట్టుకుంటాయి. మీ శ్రీమతి సలహాపాటిచటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం మంచిదికాదు.
 
మీనం : ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులకు హామీలిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. తలపెట్టిన పనులు, చర్చలు మందకొడిగా సాగుతాయి. కోర్టు పనుల్లో ప్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులు అధికం. మీపై శకునాలు, స్వప్నాల ప్రభావం అధికం. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం మాంసాహారం తీసుకోకపోతే ఎంత మేలో తెలుసా?