Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రాశి అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటే మీ దశ తిరిగినట్లే...

చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటే మన ఇంట్లో పెద్ద వారు ఒరేయ్ నువ్వు బాగుపడవు.. కనీసం పెళ్ళయినా చేసుకో... నీ భార్య అయినా నిన్ను పోషిస్తుంది. ఆ అమ్మాయి వస్తేనే బాగా చూసుకుంటుంది.. అప్పుడే నువ్వు కూడా మా

Advertiesment
Mesha rashi
, ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (13:55 IST)
చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటే మన ఇంట్లో పెద్ద వారు ఒరేయ్ నువ్వు బాగుపడవు.. కనీసం పెళ్ళయినా చేసుకో... నీ భార్య అయినా నిన్ను పోషిస్తుంది. ఆ అమ్మాయి వస్తేనే బాగా చూసుకుంటుంది.. అప్పుడే నువ్వు కూడా మారుతావ్ అంటుంటారు. పెద్దలు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే. వివాహం చేసుకోబోయే అమ్మాయిలు ఈ రాశి వారైతే వారు భర్తల్ని పోషించడం ఖాయం. అంతేకాదు ఇద్దరూ కలిసి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవిస్తారు.
 
వివాహాల విషయంలో కులగోత్రాలతో పాటుగా రాశులు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయని ప్రగాఢంగా నమ్మే సాంప్రదాయం మనది. అందుకే నిశ్చియతాంబూలాల కంటే ముందుగా జాతకాలను ఒకటికి రెండుసార్లు తరచూచూస్తారు. జన్మరాశులు కలిసిన వారినే ఏరికోరి వివాహం జరిపిస్తుంటారు. ఇలా చేస్తే వారి కాపురంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగుతుందని పెద్దల నమ్మకం. కొన్ని జన్మరాశుల వారిని పెళ్ళి చేసుకుంటే జీవితానికి ఎదురే ఉండదని పండితులు చెబుతున్నారు.
 
మేష, కర్కాటక, సింహరాశుల వారిని చేసుకుంటే మీ జీవితం చాలా బాగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కర్కాటక రాశి... ఈ రాశి మహిళల్లో సాంప్రదాయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారు చాలా సున్నితమైన మనస్కులు. వీరిలో ఆరాధన భావంతో పాటు గ్రహణ శక్తి ఎక్కువ. తుదివరకు జీవితభాగస్వామిని అంటిపెట్టుకుని ఉంటారు. 
 
ఇక మేషరాశి.. స్త్రీలు భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు. సమర్థుడైన తన భర్త తన పక్కన ఉండాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ తన మార్కు ఉండాలని కోరుకుంటారు. భర్త, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసి ఉండాలని అభిలాషిస్తారు. 
 
సింహరాశి.. ఈ రాశి కలిగిన అమ్మాయిలు చాలా శక్తివంతులు. ఆకర్షణీయమైన రూపంతో ఉంటారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా వీరిలో ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడమేకాకుండా సమస్యను నేర్పరితనంతో పరిష్కరించగలరు. అందుకే ఈ రాశి వారిని పెళ్ళి చేసుకుంటే మీ దశ తిరిగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 17-09-17