కార్తీకమాసం ప్రారంభమైంది. నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలైంది. కార్తీకమాసం నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు శాకాహారం మాత్రం తీసుకుంటారు.
ఈ నెలలో పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు వుంటాయి. కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరం.
కార్తీక పురాణంలో కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.
కాబట్టి ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో కార్తీకమాసం పూర్తవుతుంది.