Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుర్రము-గాడిద కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?

Advertiesment
horse and donkey dream meaning
, మంగళవారం, 27 జనవరి 2015 (15:42 IST)
చీమలు బారులుగా తీర్చిపోవుచున్నట్లు కల వచ్చినచో చేయు ఉద్యోగము వ్యాపారములందు అభివృద్ధి, ధనలాభము, విశేష కీర్తి ప్రతిష్టలు కలుగును. 
 
గుర్రము కలలో కనబడితే శుభప్రదము. ధనలాభము కలుగును. గుర్రముపై స్వారీ చేసినట్లు కల వచ్చినచో స్త్రీ మూలకముగా ధనలాభము కలుగును. 
 
గుర్రము మీద నుంచి కిందపడినట్లు కల వచ్చినట్లైతే కష్టములు కలుగును. కలలో గాడిదలు కనబడితే కష్టములు తొలగిపోవును. 
 
కలలో బరువులు మోయుచున్న గాడిదలు కనబడితే ధనదాయము వృద్ధి అగును. కష్టములు తొలగిపోవును. గాడిద నెక్కినట్లు కల వచ్చినట్లైతే అవమానము, అనారోగ్యము చేయు వృత్తిలో కష్ట నష్టములు కలుగును.

Share this Story:

Follow Webdunia telugu