Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురు పౌర్ణమి- 12 రాశుల వారు ఏం చేయాలంటే?

గురు పౌర్ణమి- 12 రాశుల వారు ఏం చేయాలంటే?

వరుణ్

, ఆదివారం, 21 జులై 2024 (11:15 IST)
గురు పౌర్ణమి రోజున 12 రాశుల వారు ఈ ఆలయాలను సందర్శిస్తే సర్వం సిద్ధిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది.
 
మేషరాశి జాతకులు నేడు విష్ణువు ఆలయాన్ని సందర్శించి పూజలు చేయాలి. 
వృషభ రాశి వారు భగవద్గీత బోధనలను వినాలి అన్నదానం చేయాలి. 
మిధున రాశి జాతకులు గురువు బోధించిన మంత్రాలను చదువుతూ గురువులకు బహుమతులు అందించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. 
 
కర్కాటక రాశి వారు గురువును పూజించాలి. శ్రీ మహావిష్ణు ఆరాధనలో పాల్గొనాలి.
సింహ రాశి వారు విద్యార్థులకు కావలసిన విద్యా సామాగ్రిని విరాళంగా అందించాలి.
కన్యా రాశి వారు పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. రాత్రివేళ చంద్రుడికి నీటిని సమర్పించి పూజించాలి.
 
తులా రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలి. గురుపూజ చేయాలి.
వృశ్చిక రాశి వారు గురు మంత్రాన్ని పఠించాలి. పేదలకు అన్నదానం చేయాలి.
మకర రాశి వారు చంద్రుడిని పూజించే గురు మంత్రాన్ని పాటించాలి.
మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. గురువును పూజించాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురు పౌర్ణమి.. గురువులను ధ్యానించండి.. పసుపు వస్త్రాలు దానం చేస్తే?