Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీకం: నెయ్యి దీపం లేదా నూనె దీపం.. ఏది శ్రేయస్కరం?

Advertiesment
Oil Lamp
, శనివారం, 12 నవంబరు 2022 (16:22 IST)
కార్తీక మాసంలో పూజా గృహంలో నెయ్యి లేదా నూనెతో ఏ దీపం వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరమో తెలుసుకుందాం. నెయ్యి, నూనె, ఆవనూనె లేదా జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగించడం మంచిది. దేవుడికి కుడి వైపున నెయ్యి దీపం, ఎడమ వైపు నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. 
 
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి నెయ్యి, కోరికలు నెరవేరేందుకు నూనె దీపాలు వెలిగిస్తారు. నెయ్యి దీపం వెలిగించడం వల్ల రోగాలతో పాటు ఇంటి వాస్తు కూడా పోతుంది. శివపురాణం ప్రకారం, ప్రతిరోజూ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది.
 
నెయ్యి దీపం గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. నెయ్యి సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నిరాశను తొలగిస్తుంది. నెయ్యికి విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది, దీని వల్ల చర్మ వ్యాధి ఉండదు. నెయ్యి దీపం అన్ని బాధలను నాశనం చేస్తుంది. కాబట్టి, నెయ్యి దీపం అత్యంత శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-11-2022 శనివారం దినఫలాలు - శ్రీరామును పూజించిన శుభం..