Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-06-2017 రాశి ఫలితాలు... పెద్ద మొత్తం ధనసహాయం క్షేమం కాదు...

మేషం : మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని కచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించం

06-06-2017 రాశి ఫలితాలు... పెద్ద మొత్తం ధనసహాయం క్షేమం కాదు...
, సోమవారం, 5 జూన్ 2017 (21:30 IST)
మేషం : మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని కచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధనసహాయం క్షేమం కాదు.
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్ననలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మిథునం : పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విత్తన వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కర్కాటకం : కుటుంబ, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. వ్యాపారాల అభివృద్ధికి స్థల మార్పు అవసరం. బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. నిరుద్యోగులు ఆశాదృక్పథంలో యత్నాలు సాగించాలి.
 
సింహం : స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వృత్తి ఉద్యోగస్తులకు గణనీయమైన పురోభివృద్ధి ఉంటుంది. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
కన్య : స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన అవసరం. ఖర్చులు అధికం. ధనం పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ఇతరుల సహాయం అర్థంచటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. వార్తాసంస్థల్లోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది.
 
తుల : కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా క్రమంగా సమసిపోగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు చోటుచేసుకుంటాయి. కొంతమంది మీ సరసపు వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించే ఆస్కారం ఉంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి.
 
వృశ్చికం: హోటల్, కేటరింగ్ రంగ్లాలోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. పారిశ్రామిక రంగం వారికి అధికారుల వేధింపులు, కార్మిక సమస్యలు అధికం అవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు.
 
ధనుస్సు: కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత పెద్దలతో ఆస్తి విషయాలు సంప్రదింపులు జరుపుతారు. వృత్తుల వారికి అన్నివిధాల కలిసిరాగలదు.
 
మకరం : గృహమునకు కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తిని ఇస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. రాజకీయనాయకులకు పదనీ సమస్యలు అధికమవుతాయి.
 
కుంభం : నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రత్తి, పొగాకు రంగాల్లో వారికి అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళా, ఫోటోగ్రఫీ ఉన్నత విద్య, విదేశ వ్యవహారాల రంగాల వారికి అనుకూల సమయం. 
 
మీనం : ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందటానికి మరికాస్త కృషి చేయాలి. కుటుంబీకుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మెడికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాక్చాతుర్యతకు అనుకూలంగా ఉండగలదు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎప్పుడూ నాకు కష్టాలు కలిగేట్లు చెయ్యి స్వామీ? ఎవరూ...?