Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15-02-2019 శుక్రవారం దినఫలాలు - తోటివారి సాయంతో పరీక్షల్లో...

15-02-2019 శుక్రవారం దినఫలాలు - తోటివారి సాయంతో పరీక్షల్లో...
, శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (09:22 IST)
మేషం: ఊహించని వ్యక్తుల నుండి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. వ్యాపార, ఆర్ధికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. పెరిగే, ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించడంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. 
 
వృషభం: వ్యాపారాలలో ఒడిదుడుకులు సమర్థంగా ఎదుర్కుంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. గృహం ఏర్పరచుకోవాలనే  కోరిక నెరవేరుతుంది. బంగారు, వాహనం ఇత్యాది విలువైన వస్తువులు అమర్చుకుంటారు.   
 
మిధునం: మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. మీ సంతానం మొండివైఖరి వలన చికాకులు తప్పవు. సాంఘిక, శుభ కార్యాలలో మీరు మంచి గుర్తింపు పొందాతుర. తోటివారి సహకారంతో మీరు పరీక్షల్లో సామాన్య ఫలితాలు సాధిస్తారు. గృహంలో మార్పులు వాయిదా పడుతాయి.  
 
కర్కాటకం: విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వలన ఆరోగ్యం మందగిస్తుంది.  
 
సింహం: విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ఖర్చుల వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి.  
 
కన్య: ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత, ఒత్తిడి అధికమవుతాయి. బ్యాంకు పనును అనుకూలం. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం వసూళ్లల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు పనివారి వలన సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. 
 
తుల: పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట అధికం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు వాగ్విదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది.  
 
వృశ్చికం: వ్యాపారులకు షాపుల మార్పిడికి అనుకూలం. ధనమూలక సమస్యలు ఒక కొలిక్కివస్తాయి వాయిదా పడిన పనులు ఎట్టకేలకూ పూర్తిచేస్తారు. విద్యార్థులకు ప్రేమవ్యవహారాల్లో భంగాపాటు తప్పదు. ఖర్చులు భారీగానే ఉంటాయి. ధనం కూడా విరివిగా వ్యయం చేస్తారు. లిటిగేషన్ వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. 
 
ధనస్సు: పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. మీపై శకునాలు, ఇతురల వ్యాఖ్యాల ప్రభావం అధికం.  
 
మకరం: కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు, రావలసిన ధనం వాయిదా పడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఐరన్, సిమెంటు, స్టాకిస్టులకు పురోభివృద్ధఇ. ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు అనుకోకుండా పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.   
 
కుంభం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. సోదరీసోదరుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీల తొందరపాటు తనానికి ఊహించిన చికాకులు తలెత్తవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకులు తప్పదు.
 
మీనం: దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఏ విషయంలోను మొహమ్మాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయడం శ్రేయస్కరం. చేపట్టిన పనులలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో జీవించటం కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది...