Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-02-2019 - గురువారం మీ రాశి ఫలితాలు - ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి...

Advertiesment
14-02-2019 - గురువారం మీ రాశి ఫలితాలు - ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి...
, గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:38 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతారాలెదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు.
 
వృషభం: ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలలో ఆటంకాలు తప్పవు. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు. 
 
మిధునం: స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వలన స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు.  
 
కర్కాటకం: పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. గృహ వాస్తు నివారణ వలన మంచి ఫలితాలుంటాయి. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.  
 
సింహం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. పాతమిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో చికాకులు తప్పవు. విద్యార్థినులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. 
 
కన్య: ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.. జాగ్రత్త వహించండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ వంటివి ఎదుర్కుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది.  
 
తుల: కోర్టు వ్యవహారాలు వాయిదా పడడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. ఉద్యోగస్తులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి.  
 
వృశ్చికం: ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. సన్నిహితుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.  
 
ధనస్సు: మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచవద్దు. భాగస్వామిక ఒప్పందాలు, హామీలు, చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. యత్నాలు ఫలించక, అవకాశాలు కలిసిరాక విరక్తి చెందుతారు. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. 
 
మకరం: ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. రాబోయే ఖర్చులకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు.    
 
కుంభం: ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. అధికారులకు మీ అభిప్రాయలను సూచనప్రాయంగా తెలియజేయండి. రుణాలు చేస్తారు. అనుమానాలు, అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.    

మీనం: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఓర్పుతో పరిస్థితులను భరించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఇతర ఆలోచనలు విరమించుకుని ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారని భావం నిరుత్సాహం కలిగిస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-02-2019 - బుధవారం రాశి ఫలితాలు.. అక్షర దోషాలు తలెత్తకుండా?