Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

15-03-2018 గురువారం మీ రాశిఫలితాలు.. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే?

మేషం: ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం మిమ్ముల్ని ఇరకాటానికి గురిచేస్తుంది. ముఖ్యుల రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. పంతాలకు పోకుండా లౌక్యంగా

Advertiesment
daily horoscope
, గురువారం, 15 మార్చి 2018 (08:51 IST)
మేషం: ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం మిమ్ముల్ని ఇరకాటానికి గురిచేస్తుంది. ముఖ్యుల రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. పంతాలకు పోకుండా లౌక్యంగా మీ పనులు చక్కబెట్టుకోవలసి వుంటుంది. వృత్తిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. 
 
వృషభం: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు. పత్రికా సంస్థల్లోని వారు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. 
 
మిథునం: ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. నూతన పరిచయాలేర్పడతాయి. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. సంఘంలోను, కుటుంబంలోను మీ మాటకు ఆదరణ లభిస్తుంది.
 
కర్కాటకం: ప్రయాణాలు, బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెలకువ అవసరం. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. భాగస్వామిక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి.
 
సింహం: మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికం. విద్యార్థినులకు వాహనం నడుపునప్పుడు ఏకాగ్రత ముఖ్యం.
 
కన్య: మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవడంతో పాటు క్రమంగా స్థిరపడతారు.
 
తుల: విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా మీ పనులు సానుకూలమవుతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులతో సంప్రదింపులు, వ్యాపార లావాదేవీలకు అనుకూలం. స్త్రీల ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం.
 
ధనస్సు: వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి తప్పవు.
 
మకరం: కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
కుంభం: విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. స్వయంకృషితో రాబడికి మించి ఖర్చులుంటాయి. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లోని వారికి కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి కొత్త కళ: జయవిజయల నుంచే స్వామి విగ్రహం వెలిగిపోతోంది