Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

సోమవారం దినఫలాలు... ఆరోగ్యం విషయంలో జాగ్రత్త...

మేషం: ఆలయ సందర్శనాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయం, సహకారాలు అర్థిస్తారు. విద్యార్థులు విశ్రాంతి పొంద

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 15 జనవరి 2018 (08:27 IST)
మేషం: ఆలయ సందర్శనాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయం, సహకారాలు అర్థిస్తారు. విద్యార్థులు విశ్రాంతి పొందుతారు. ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉండగలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృషభం: ఇష్టంలేని వారికి సలహా ఇచ్చి భంగపాటుకు గురవుతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కొద్దిగా చికాకులు ఉన్న వ్యవహారాలందు జయం పొందుతారు. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : స్థిరాస్తి మూలక ధనం చేతికందుతుంది. వృత్తిపరమైన ఆటంకాలను అధికమిస్తారు. మీ గౌరవ, అభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. బంధు మిత్రుల నుంచి నిష్టూరాలు ఎదుర్కోవలసి వస్తుంది. దైవదర్శనాలు, మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
సింహం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ పనులు రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ సంతానం కదలికలను గమనించడం ఎంతైనా అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
సింహం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ పనులు రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ సంతానం కదలికలను గమనించడం ఎంతైనా అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
కన్య : నూతన దంపతుల్లో ఉత్సాహం, అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు.
 
తుల : స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. విదేశీయానం, రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. రేడీమేడ్ వస్త్ర, వ్యాపారులు, ఫ్యాన్సీ, పచారీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం : దైవ, పుణ్య సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కపటంలేని మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
ధనస్సు : పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.
 
మకరం : మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ శక్తిసామర్థ్యాలు, నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
 
కుంభం : ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది.
 
మీనం : తరచుగా తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపడతారు. స్త్రీలకు నడుము, నరాలు ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం దినఫలాలు : స్త్రీలు ఆడంబరాలకు పోరాదు...