కలియుగంలో సమస్యలు లేకుండా ఎవరూ జీవించట్లేదు. రకరకాల సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతూనే వున్నారు. కుటుంబంలో, ఇతరులచే, బంధువులచేత, ఆరోగ్యం, ఆర్థిక పరమైన ఇబ్బందులను చాలామంది ఎదుర్కొంటూనే వున్నారు.
అయితే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వున్నాయి. కుటుంబంలో ఐక్యత కొరవడితే, ఆర్థిక ఇబ్బందులు తరచుగా వేధిస్తూ వుంటే... అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటే.. శత్రుబాధ తొలగిపోవాలంటే.. సులభమైన పరిహార మార్గం వుంది.
రోజూ సాయంత్రం పూట వేపాకుపై రెండు మట్టి ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఎలాగంటే.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా పసుపుకుంకుమలతో అలంకరించబడిన తర్వాత.. రంగవల్లికలు తీర్చిదిద్ది దానిపై వేపాకు వుంచి దీపం వెలిగించాలి.
ఈ దీపానికి నువ్వుల నూనె, పసుపు రంగు వత్తులను ఉపయోగించడం మంచిది. ఇలా చేస్తే నరదృష్టి బాధలుండవు. శత్రుభయం వుండదు. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఈ దీపాన్ని తూర్పు లేదా పడమర వైపు వుండేలా వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.