Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-05-2023 నాడు బుద్ధపూర్ణిమ.. కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి..?

Advertiesment
Budha
, గురువారం, 4 మే 2023 (10:00 IST)
05-05-2023 నాడు బుద్ధపూర్ణిమ. వైశాఖ పౌర్ణమి అయిన ఈ రోజున ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జన్మించిన రోజున బుద్ధ జయంతి జరుపుకుంటారు. ఇదే రోజున బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని విశ్వసిస్తారు. ఈ సంవత్సరం గౌతమ బుద్ధుని 2585వ జయంతిగా జరుపుకుంటారు. 
 
ఈ రోజున ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. ఇంటిని శుభ్రం చేసుకుని.. ఇంటి ముఖ ద్వారం ముందు పసుపుతో లేదా కుంకుమతో స్వస్తిక్ వేయాలి. పేదలకు దానంగా ఆహారం, దుస్తులు ఇవ్వాలి. వైశాఖ పౌర్ణమి రోజున సముద్ర స్నానం తప్పక ఆచరించాలి. 
 
ఈ రోజున కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానమాచరించడం ద్వారా వల్ల నరఘోష, నరదిష్టి తొలగిపోతుందని విశ్వాసం. జ్ఞాన పూర్ణిమ, బుద్ధ పౌర్ణమి, శ్రీ కూర్మ జయంతి, అన్నమయ్య జయంతి అన్నీ విశేషాలు ఈ రోజున జరుపుకుంటారు.

వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తోంది. అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించడం.. ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. సంపదలు కలగాలనే కోరికతో ఈ రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. 
 
గౌరీదేవిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున ఆకలతో వున్న వారికి అన్నదానం చేయడం, పేదవారికి వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటికుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకుని పూజించడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మ హత్తి దోషం అంటే ఏమిటి...? అది ఎలా ఏర్పడుతుంది...