Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2015లో తులా రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి....

Advertiesment
2015 Horoscope and Astrology
, బుధవారం, 31 డిశెంబరు 2014 (21:55 IST)
చిత్త 3, 4 పాదములు (రా, రి)
స్వాతి 1, 2, 3, 4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1, 2, 3, 4 పాదములు (తీ, తూ, తే)
ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5

 
తులా రాశివారికి జూలై 14 వరకు రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లాభము నుందు, ఈ సంవత్సరం అంతా వ్యయము నందు రాహువు, షష్ఠమము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా ద్వితీయము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'ధైర్యం సర్వత్ర సాధకమ్' అన్నట్లుగా ధైర్యంతో ముందుకు పోవడం వల్ల అన్నింటా విజయం చేకూరుతుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తిపరమైన చికాకులు తొలగిపోగలవు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, బాధ్యతల మార్పు సంభవం. 
 
నిరుద్యోగులు ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు కొంత చికాకు కలిగిస్తుంది. రాజకీయ రంగాల్లో వారికి అనుకున్నంత మార్పులు ఏమీ ఉండవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. నడుము, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు, చిన్నతరహా పరిశ్రమల్లోవారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ వస్తులాభం కలుగుతుంది. గృహంలో శుభ కార్యానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
సంగీత, సాహిత్య కళారంగాల్లో వారికి అనుకోని పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఇన్వెంటరీ, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. వైద్య రంగాల్లో వారికి శ్రమాధిక్యత అధికంగా ఉన్నప్పటికీ మంచి పేరు, ఖ్యాతి లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసి రాగలదు. విదేశీయానానికై చేయు యత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త వహిచండి. విందులు, వినోదాలలో పాల్గొనడం వల్ల మీలో స్నేహభావం అధికమవుతుంది. ప్రయాణాలలో ఒకింత చికాకులు తప్పవు. 
 
ఈ రాశివారికి ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి మాస శివరాత్రికి రుద్రునికి అభిషేకం చేయించి, బిల్వదళాలతో అర్చించి, తీర్థం తీసుకున్న దోషాలు తొలగిపోతాయి. ఈ రాశివారు గజలక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజించడం వల్ల పురోభివృద్ధి పొందుతారు. ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణం చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
"నీలాంజన సమభావం, రవి పుత్రం యమాగ్రజమ్I 
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరంII"
 
** చిత్తా నక్షత్రం వారు తాటి చెట్టును, స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టును, విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టును దేవాలయాలలో గానీ, విద్యా సంస్థల లోగానీ, ఖాళీ ప్రదేశాలలో గానీ నాటి ఈ చెట్ల అభివృద్ధికి దోపడినా మీకు అభివృద్ధి కానవస్తుంది. 
 
చిత్తా నక్షత్రం వారు జాతి తెల్లపగడాన్ని, స్వాతి నక్షత్రం వారు ఎర్ర గోమేధికాన్ని, విశాఖ నక్షత్రం వారు వైక్రాంతవణి లేక కనకపుష్యరాగాన్ని ధరించినా మీకు శుభం జయం కానవస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu