Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి దినఫలాలు : సాయిబాబాను స్మరించిన మంచిది..

మేషం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు.

నేటి దినఫలాలు : సాయిబాబాను స్మరించిన మంచిది..
, గురువారం, 14 డిశెంబరు 2017 (06:05 IST)
మేషం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్ప
నిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెద్దలకు అపుడపుడు వైద్య సేవలు తప్పవు. 
 
వృషభం : విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. 
 
మిథునం : దైవ, సేవా, పుణ్యకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. అదనపు సంపాదన కోసం అన్వేషిస్తారు. ప్రత్యర్థులు మీ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత్త చాలా అవసరం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం తప్పదు. 
 
కర్కాటకం : విద్యార్థినిలకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు తప్పవు. వ్యాపారసంస్థల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. తలపెట్టిన పనుల వాయిదా వేయవలసి వస్తుంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది సహాయం అందిస్తానన్న వారు సమయానికి తప్పుకోవడం వల్ల ఆందోళన తప్పదు. 
 
సింహం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీల పేరిట పొదుపు పథకాలు లాభిస్తాయి. ప్రయాణాలలో ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు శ్రేయస్కరం మంచిదికాదు. గతంలో వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. రుణ విముక్తుల కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. 
 
కన్య : ఆదాయం కంటే ఖర్చులు అధికం. బంధువులు, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవగాహన లేని విషయాలు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. 
 
తుల : వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, బహుమతులు అందించి వారి ప్రాపకం సంపాదిస్తారు. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. 
 
వృశ్చికం వస్త్ర, బంగారు, వెండి, లోపపనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాగ్వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉంచండి. ఉన్నతస్థాయి అధికారులకు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. పాత పరిచయస్తుల కలయికతో మీలో మార్పు వస్తుంది. స్నేహితుల వల్ల ఇబ్బందులెదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి. సాంఘిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకుల మధ్య చిన్నచిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. 
 
మకరం : డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అససరం. శత్రువులు మిత్రులుగా మారతారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. 
 
కుంభం : మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. పాత రుణాలు తీరుస్తారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకువ అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. 
 
మీనం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దుబారా ఖర్చులు అధికం. విరోధులు వేసే పథకాలు తెలివితో తిప్పిగొట్టగలుగుతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2018 కొత్త సంవత్సరం... అందుకోసం మీరొక చిరునవ్వు చిందించండి...