Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుస్సు రాశి జాతకులు.. దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటే?

12 రాశులు- ఆ రాశుల్లో జన్మించిన జాతకులకు శుభ ఫలితాలను ఇచ్చే ప్రధాన ద్వార నిర్మాణం గురించి తెలుసుకుందాం. మేష రాశిలో జన్మించిన జాతకులు పడమర దిశ వైపుగా ప్రధాన ద్వారాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. కానీ నైరుతి దిశలో ఈ రాశికి చెందిన జాతకుల

Advertiesment
12 Rashi vastu door
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (14:48 IST)
12 రాశులు- ఆ రాశుల్లో జన్మించిన జాతకులకు శుభ ఫలితాలను ఇచ్చే ప్రధాన ద్వార నిర్మాణం గురించి తెలుసుకుందాం. మేష రాశిలో జన్మించిన జాతకులు పడమర దిశ వైపుగా ప్రధాన ద్వారాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. కానీ నైరుతి దిశలో ఈ రాశికి చెందిన జాతకులు ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయడం కూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  
 
ఇక కుంభం, మీనరాశిలో జన్మించిన జాతకులు పడమర దిశలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో ఏర్పాటు చేసుకునే ప్రధాన ద్వారం ద్వారా ఇంటి యజమానికి సకలసంపదలు చేకూరుతాయి. సింహ రాశిలో జన్మించిన వారికి తూర్పు దిశ మంచి ఫలితాలను ఇస్తుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇదే విధంగా తులాం, కన్యారాశి జాతకులకు తూర్పు దిశ వైపు ప్రధాన ద్వారాన్ని ఏర్పరుచుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
ధనుస్సు రాశికారులకు దక్షిణ దిశ వైపు ప్రధాన ద్వారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ దిశ వైపు ప్రధాన ద్వారాన్ని అమర్చడం ద్వారా శుభఫలితాలుంటాయి. కానీ నైరుతి వైపు మాత్రం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయకూడదు. మకరం, వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు దక్షిణ దిశవైపు ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. తద్వారా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు చేకూరుతాయి. 
 
మిథునం, వృషభం రాశుల్లో జన్మించిన జాతకులకు ఉత్తర దిశలో ప్రధాన ద్వారం కలిగిన ఇంటి స్థలం మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకు కూడా ఉత్తర దిశలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా శుభపలితాలుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరామ నవమి రోజున పూజ ఇలా చేయండి.. పసుపు రంగు దుస్తులు ధరించండి