Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 రాశుల జాతకులు ధరించాల్సిన నవరత్నాల లిస్ట్ ఇదే!

Advertiesment
నవరత్నాలు
FILE
12 రాశుల జాతకులు ధరించాల్సిన నవరత్నాల గురించి తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి.

మేషం- మేషరాశి జాతకులు పగడాన్ని ధరించాలి. ఈ జాతకులు పగడపు రత్నాన్ని ధరించడం ద్వారా దైవ కటాక్షం లభిస్తుంది. కోపం తగ్గుతుంది. అదృష్టం కలిసొస్తుంది.

వృషభ రాశికారులు.. వజ్రాన్ని ధరించాలి. వజ్రాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు, మంచియోగం లభిస్తుంది. ఇంకా వజ్రాధరణతో వృషభ జాతకులకు ప్రత్యేక ఆకర్షణ, తేజస్సు లభిస్తుంది.

మిథునం : జాతిపచ్చను ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ రత్నాన్ని ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి వుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

కర్కాటక జాతకులు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సకలసంపదలు లభిస్తాయి. వాణిజ్యపరంగా, ఆరోగ్యపరమైన సమస్యలుండవు.

సింహం- కెంపును ధరించాలి. రూబీ అనే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా అదృష్టవంతులవుతారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

కన్యారాశి జాతకులు జాతిపచ్చను ధరించడం మంచిది. దీన్ని ధరించడం ద్వారా వాణిజ్యపరంగా ముందడుగు వేస్తారు. అదృష్టాన్నిస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి.

తులా రాశి జాతకులు (Diamond) వజ్రాన్ని ధరించడం ద్వారా వాహనాల కొనుగోలు చేస్తారు. రావాల్సిన ఆస్తులు వస్తాయి. తేజస్సు లభిస్తుంది. మంచి యోగం చేకూరుతుంది.

వృశ్చిక లగ్నకారులు పగడం ధరించాలి. దీన్ని ధరించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. ఆగ్రహం తగ్గిపోతుంది. అదృష్టం చేకూరుతుంది. సకల సంతోషాలు చేకూరుతాయి.

ధనుస్సు- కనక పుష్య రాగం (Yellow Shappire): ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులు కనకపుష్యరాగాన్ని ధరించాలి. పసుపు రంగులో ఉండే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా సిరిసంపదలు చేకూరుతాయి. మానసిక ప్రశాంతనిస్తుంది. ఆస్తులు చేకూరుతాయి.

మకర రాశి - నీలం (Blue Shappire): మకర జాతకులు నీల రత్నాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. దైవానుగ్రహం లభిస్తుంది.

కుంభం - నీలం (Blue Shappire): కుంభ రాశి జాతకులు కూడా నీల రత్నాన్ని ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దైవానుగ్రహం లభిస్తుంది.

మీనం - కనక పుష్య రాగం (Yellow Shappire) : మీన రాశి జాతకులు ఈ రత్నాన్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంత చేకూరుతుంది. సకలసంపదలు చేకూరుతాయి.

Share this Story:

Follow Webdunia telugu