Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది...?

Advertiesment
సెప్టెంబర్ నెల
FILE
సెప్టెంబర్ నెలలో గ్రహాల పరిస్థితిని గమనిస్తే వాతావరణం, ప్రజల మానసిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతుంది. ఈ నెలలో రాజకీయ ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకులుపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది.

సెప్టెంబర్ 9 గురించి ఆలోచిస్తే శని గ్రహం కన్యారాశిలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి తుఫాను అధికంగా ఉండి వర్షాలు కుండపోతగా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ నెల మధ్యలో శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తుండటంతో బంగారం, ఎర్రటి వస్తువులు, పశువుల ధరలు అధికంగా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఆ తర్వాత వర్షాభావం తలెత్తే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే సూచనలు కనపడుతున్నాయంటున్నారు జ్యోతిష్యులు.

సెప్టెంబర్ 16న రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఉత్తర మరియు పశ్చిమ దేశాలలో కష్టాలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. కాని తూర్పు దేశాల్లో యుద్ధ భయం నెలకొంటుంది. రవి కన్యారాశిలోకి ప్రవేశించడంతో దక్షిణ దేశాల్లో సుభిక్ష, సుఖ-శాంతులు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు.

గ్రహాలు తమ తమ రాశులనుంచి వేరే రాశులలోకి మారుతున్నప్పుడు శుభాశుభ ఫలితాలు ప్రజలపై పడుతుంది. అలాగే ప్రకృతిపరంగా ఉత్పత్తయ్యై ఆహార పదార్థాలు, కర్మాగారాలపై కూడా ప్రభావం పెరుగుతుంది. ఈ నెలలో భూకంపం తదితర పకృతిపరమైన ప్రకోపాలు కలుగుతాయి.
webdunia
FILE


వీటితోపాటు ఈశాన్య ప్రాంతంలో విచ్ఛిన్న కరమైన అంశాలు చోటు చేసుకోనున్నాయి. వరి, గోధుమల ధరలు మరింత పెరిగే సూచనలున్నాయి. అలాగే అగ్నితో భయభ్రాంతులయ్యే అవకాశాలున్నాయి.

"శనేశ్చ పంచకం దృష్ట్వా పాతాలే కంపతే ఫణీ I ఈశాన్ దేశభంగశ్చ బహిదాహో మహర్ధతా II

సెప్టెంబర్ నెల 24న బుధుడు సింహరాశిలో వక్రగతిలో ప్రవేశిస్తున్నాడు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు స్థిరంగా ఉంటాయి. బంగారం ధరలు పెరిగే అకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల చివరిలో చక్కెర ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు కనపడుతున్నాయి.

వాతావరణం గురించి ఆలోచిస్తే ఈ నెలలో రవితోపాటు శని గ్రహం కలిసి ఉండటంతోపాటు శుక్ర మరియు బుధ గ్రహాలు కలిసి రావడంతో వర్షాలు అధికంగా ఉంటాయి. వేగవంతంగా గాలులు వీసే సూచనలు కనపడుతున్నాయి.

కొన్ని చోట్ల కుంభవృష్టి వానలు కురిసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, హిమాచల ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాలలో రుతువులు పరివర్తనం చెందే సూచనలు మెండుగా కనపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu