సింహరాశిలో పుట్టిన జాతకులు ఎలా ఉంటారంటే..?
సింహరాశిలో జన్మించిన జాతకులు ఎల్లప్పుడు చురుకుదనంతో దర్శనమిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇతర రాశుల్లో పుట్టిన జాతకుల కంటే సింహరాశిలో జన్మించిన జాతకులు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తాము అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఇతరులకు సహాయపడటం, ఇతరుల పట్ల దయ, ప్రేమతో నడుచుకోవటం వీరి స్వభావం.ఇతరులు తమను అధికంగా ప్రశంసించడాన్ని ఈ జాతకులు ఇష్టపడరు. సామాజిక సేవలో ఆసక్తి చూపుతారు. ఎలాంటి కార్యాన్నైనా ఒంటి చేతుల్లో నడిపించే సామర్థ్యం వీరికుంటుంది. లక్ష్యసాధనతో దూసుకెళ్లే ఈ జాతకులకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ చేయడం ద్వారా ఎలాంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరు ఉద్దేశించి చేసే ప్రతీ కార్యం పరులకు ఉపయోగకరంగా ఉంటుంది. అందరిపై అధికారం చెలాయించే ఈ జాతకులు ఇతరులను మంచి మార్గంలో నడిపించాలని సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇంకా బంధువులకు, స్నేహితులకు సన్నిహితంగా ఉంటారు. బంధువులకు, స్నేహితులకు అన్నీ కోణాల్లో సహాయాలను, ఉపాయాలను అందిస్తారు. వేదాంత సారాంశాలపై మిక్కిలి మక్కువను కలిగియుంటారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు. అంతేగాకుండా ఇతరులను అదే త్రోవలో నడిపించటానికి ప్రయత్నిస్తారు. అయితే కారణం లేని అంశాలపై కోపపడటం వీరి స్వభావం. ఇంకా వీరికి ప్రయాణాలంటే ఆసక్తి. శ్రమించి పనిచేయటం ద్వారా మంచి సుఖభోగాలను అనుభవిస్తారు.ఇకపోతే సింహరాశిలో జన్మించిన జాతకులకు ఆదివారం అన్ని విధాలా కలిసివస్తుంది. బుధవారం కూడా వీరికి శుభదినమే. కానీ మంగళవారం మాత్రం వీరికి శుభఫలితాలను ఇవ్వదు. ఇంకా శనివారం సామాన్య ఫలితాలనిస్తుంది. సింహరాశి జాతకుల అదృష్ట సంఖ్యలు: 1, 4సింహరాశి జాతకులకు కలిసొచ్చే రంగు: ఎరుపు.