శతభిష నక్షత్రంలో పుట్టారా..? ఐతే స్నేహితులు ఎక్కువే!
రాహు గ్రహ నక్షత్రమైన శతభిష నక్షత్రంలో పుట్టిన జాతకులు తన కుటుంబం కోసం అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు. కుటుంబం కోసం రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తారు. వీరి పట్టుదల, కృషితో సంతానం మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు.ఇంకా ఈ నక్షత్రములో జన్మించిన వారికి అన్ని రంగాల్లో స్నేహితులు ఉంటారు. కానీ స్నేహితుల నుంచి ఉపయోగాలను ఏ మాత్రం ఆశించరు. అయితే ఎల్లవేళలా ఎవరికో ఒకరికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది.ఇకపోతే.. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ స్పెక్యులేషన్ వీరికి లాభిస్తుంది. ఎగుమతి వ్యాపారం వీరికి కలిసివస్తుంది. దీంతో అధిక మొత్తంలో ధనాన్ని త్వరగా సంపాదిస్తారు. కమీషన్ ఏజెంట్‌గా, బిజినెస్ ప్రమోటర్స్‌గా ఈ జాతకులు రాణిస్తారు. అలాగే పొదుపుగా ఉండటం వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అయితే అన్ని విషయాలను దాచుకోకుండా లేకుండా ఇతరులతో చెప్పేయడం ఎవరి మెప్పుకోసమో సొంత వారిని దూరం చేసుకోవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే.. శతభిష నక్షత్రంలో పుట్టిన జాతకులకు శనివారం అన్ని విధాలా కలిసొస్తుంది. శనివారం ప్రారంభించే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే, శుక్ర, ఆదివారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను ఇస్తాయి. అయితే గురువారం మాత్రం ఈ జాతకులకు అనుకూలించదు.అలాగే శతభిష నక్షత్రంలో పుట్టిన జాతకులకు నలుపు, నీలం, పచ్చ రంగులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రంగుల్లో దుస్తులు ధరించడం ద్వారా వీరికి మనశ్శాంతి చేకూరుతుంది. అందుచేత ఎప్పుడూ నలుపు లేదా నీలం రంగు చేతి రుమాలును వాడటం మంచిది. రోజూ వాడే దుస్తుల్లో పై మూడు రంగులు కాసింతైనా ఉండేలా చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇక శతభిష నక్షత్రంలో పుట్టిన జాతకులకు 4, 8, 13, 22, 31, 40, 58, 67 అనే సంఖ్యలు కలిసివస్తాయి. అలాగే 8, 17, 26, 35, 44, 53, 62, 71, 80 అనే సంఖ్యలు కూడా వీరికి శుభఫలితాలను అందజేస్తాయి. అయితే 1, 2, 9 అనే సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.