Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేవతి నక్షత్రం, రెండో పాదములో జన్మించినవారైతే!?

Advertiesment
రేవతి నక్షత్రం
FILE
రేవతి నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన 13 సంవత్సరముల వయస్సు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 13 సంవత్సరముల నుంచి 20 సంవత్సరముల వరకు తేకు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

20 సంవత్సరముల నుంచి 40 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రాన్ని బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 40-46 సంవత్సరములు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండితో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించడం మంచిది. 46-56 సంవత్సరములు ఈ జాతకులకు చంద్ర మహర్దశ కావున ముత్యాన్ని వెండిని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

56 సంవత్సరము వయస్సు నుంచి 63 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడాన్ని బంగారముతో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించాలి. 63 సంవత్సరముల నుంచి 81 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu