మీ సంఖ్య 2 అయితే.. సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?
మీ పుట్టిన తేదీ రెండా.. అయితే మీకు చంద్రుడు గ్రహాధిపత్యం వహిస్తాడు. ఈ జాతకులు సెన్సెటివ్‌గా ఉంటారు. కలివిడిగా ఉండరు. డిప్లొమా చదువులు చదివే ఈ జాతకులు ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. అందుచేత చదువులో శ్రద్ధ చాలా అవసరం. అయితే నిజాయితీగా, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటారు. రచయితలుగా, కళాకారులుగా రాణిస్తారు. ఎలాంటి సమస్యలనైనా సునాయాసంగా ఎదుర్కోవడంలో సమర్థవంతంగా వ్యవహరిస్తారు. ఇక ఈ జాతకుల కలిసొచ్చేవి.. ఫ్రెండ్లీ నంబర్స్-1, 3ఎనిమీ నంబర్స్ -5,4 రోజు - సోమవారం కలిసొస్తుంది.రంగు - తెలుపు రత్నం -ముత్యం మెటల్ - వెండికలిసొచ్చే వ్యాపారాలు- రియల్ ఎస్టేట్, సేల్స్, రాజకీయాలు, టీచర్స్, ఉపాధ్యాయ వృత్తి, డిప్లమా చదువులు. వ్యాపారానికి- 2, 7, 8 వివాహానికి - 1, 2, 7, 8రొమాన్స్‌కు - 2, 3, 7, 8 అనే నెంబర్లు కలిసొస్తాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.