వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులని వారు అంటున్నారు.
ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉండే వీరికి బాల్యం సుఖసంతోషాలతో గడిచిపోతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం అంతర్గతంగా ఉంటుంది. జీవితంలో త్వరితంగా పైకి వస్తారు. దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు.
దేశభక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.
ఇంకా క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు.