మఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినవారైతే..!?
కేతుగ్రహ నక్షత్రమైన మఖ నాలుగో పాదంలో పుట్టిన జాతకులు ఇతరుల సొమ్మును ఏ మాత్రం ఆశించరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించి కార్యచరణ చేసే వీరికి.. జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఇంకా మఖ నక్షత్రం, నాలుగో పాదంలో పుట్టిన జాతకులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందు వెనుక ఆలోచిస్తారు. పొదుపు చేయడం ద్వారా వీరి వృద్ధాప్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సజ్జనులుగా, సౌమ్యులుగా పేరు తెచ్చుకునే ఈ జాతకులకు విదేశీయాన యోగం బాగా కలిసి వస్తుంది. ఇంకా స్పెక్యులేషన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. గణితం, అడ్మినిస్ట్రేషన్‌లలో నిపుణత గల ఈ మఖ నక్షత్ర జాతకులు ఉన్నత స్థితిని చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. అయితే జరిగిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు తలచుకుని బాధపడటం వీరి నైజం. ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి అన్ని విధాలా సాయం చేస్తారు. ప్రకృతిని ఆస్వాదించే ఈ జాతకులు.. ఉన్నత పదవులను అలంకరిస్తారు. ఇకపోతే.. మఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు సూర్య గ్రహ ప్రభావం ఉండటంతో ఎరుపు రంగు వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇంకా ప్రతి రోజూ ధరించే దుస్తుల్లో కొంతైనా ఎరుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే ఈతిబాధలు తొలగిపోవాలంటే.. ఆదివారం సూర్యగ్రహ శాంతికి గోధుమలు నైవేద్యంగా సమర్పించుకోవడం మంచిది. ఇంకా వీరికి 1, 4 అనే సంఖ్యలు కలిసివస్తాయి. ఇంకా ఆదివారం ఈ జాతకులు అన్నీ విధాలా అనుకూలిస్తుంది. ఇంకా బుధ, శనివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ మంగళవారం మాత్రం ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను చేపట్టకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.