మంగళవారం ఎర్రని వస్త్రం, కందులు దానం చేస్తే.!?
, సోమవారం, 12 డిశెంబరు 2011 (11:14 IST)
ఈయనకు మంగళుడని కూడా పేరు. ఈయన భూకారకుడు, యుద్ధకారకుడు అంటారు. దంపతుల మధ్య అనురాగం, సఖ్యత ఈ గ్రహదృష్టి మీదనే ఆధారపడతాయి. కుజుని వక్రదృష్టి వల్లనే సీతారాముల వియోగం జరిగింది. రామరావణ యుద్ధం సంభవించింది. ఊర్మిళాదేవికి, లక్ష్మణునికి పద్నాలుగేళ్లపాటు ఎడబాటు కలిగింది.ఆరాధనావిధానం:"
ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం" అనే శ్లోకాన్ని పఠించాలి. మంగళవారం ఎర్రని వస్త్రం, కందులు దానం చేయాలి. పగడం ధరించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.