Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్యమి నక్షత్రమా? నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం వీరిది!

Advertiesment
భవిష్యవాణి
FILE
శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యము నుంచి యవ్వనము వరకు కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అంతేకాదు.. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి.

వ్యాపార, సినీ రంగాల్లో రాణించే పుష్యమి నక్షత్ర జాతకులు విస్తృతమైన పరిధిని కలిగి ఉంటారు. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు.

అంతేగాకుండా యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. మంచి సలహాదారులు వీరికి లభించినా.. కొందరి తప్పుడు సలహాలతో కొన్ని అపశృతులు దొర్లుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.. వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే.. శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.

అదేవిధంగా.. సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో ఎలాంటి పనిని ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే వీరి అదృష్ట సంఖ్యలు: 2, 7.

Share this Story:

Follow Webdunia telugu