Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవగ్రహ కారక దేవతల గురించి మీకు తెలుసా?

Advertiesment
నవగ్రహాలు
FILE
రాశుల్లో పన్నెండు స్థానాలకు అధికారం ఉన్నట్టే నవగ్రహాలకు దేవతలున్నారు. నవగ్రహాల్లో ప్రతి గ్రహం శుభ, అశుభ ఫలితాలను అందజేస్తుంది. ఇందులో భాగంగా.. జాతకులు తమ గ్రహాధిపత్యాన్ని అనుసరించి, ఆయా గ్రహాన్ని పూజిస్తే సుఖసంతోషాలు నెలకొంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇందులో నవగ్రహాలు వాటి కారక ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. సూర్యుడు: ఆత్మ, శిరస్సు, వైద్యం ప్రతాపం, ధైర్యం, రాజసేవ, తపస్సు, ఉద్యోగం, గోధుమలు, మిరియాలు, యాత్ర, ధ్వని వంటి వాటికి కారకుడు.

చంద్రుడు: మాత, పరాశక్తి, వస్త్రం, సుఖభోజనం, శరీరం, నిద్ర, శీతం వ్యాధులు, గాయాలు, రుణాలు, వెన్న, బియ్యం, వెండి, సమరం, కీర్తి వంటి వాటికి చంద్రుడు కారకుడు.

కుజుడు: సోదరత్త్వం, భూమి, అగ్ని, యుద్ధం, గాయాలు, ద్వేషం, వ్యయం, ఉత్సాహం, పగడం వంటి వాటికి కారకునిగా కుజున్ని వ్యవహరిస్తారు.

బుధుడు: విద్య, జ్ఞానం, దానాధిపతి, రథాసీనుడు, వాక్చాతుర్యం, ఉపాసన, కథాకావ్యాలు, వృత్తి, నాట్యం, వాత వ్యాధులు, ఆకులు, ధాన్యాలు వంటి వాటికి బుధుడు కారకుడు.

గురు: సంతానం, అష్టమాసిద్ది, ఉపదేశం, బుద్ధి, రాజ్యాధిపత్యం, శృతి శాంతం, స్వర్ణం, వైఢూర్యం, పుష్పరాగం, పుష్పం, నేత్రాలు వంటి వాటికి గురువు కారకుడు.

శుక్రుడు: కళత్రం, కీర్తి, సంగీతం, వాద్యం, భరత నాట్యం, సుగంధ ద్రవ్యాలు, రూపవంతం, యవ్వనం, రత్నం ,వ్యాపారం, లోహాలు వంటి వాటకి శుక్రుడు కారకుడు.

శని: ఆయుష్మంతం, జీవనం, సేవకం, నీల రత్నం, జైలు జీవనం, చిత్తభ్రమ, రుణం, అంకవికలాంగం, ఆవాలు, నూనె వంటి వాటికి శనీశ్వరుడు కారకుడు. అంతేగాకుండా ఇతని కాలంలో వివిధ సమస్యలు తలెత్తుతాయి.

రాహు: ఆయుషు, యోగం, ప్రతాపం, వృత్తుల అవకాశాలు, జలఖండనం, పిత్తం, అంగవిహీనం, గాయాల కారకుడు రాహువే. ఇక కేతువు: జ్ఞానం, కపటమైన వృత్తులు, విదేశీ జీవనం వంటి వాటికి కేతువే కారకుడవుతాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అందుచేత శనివారాల్లో తమ గ్రహాధిపత్యాన్ని అనుసరించి ఆయా గ్రహాలకు నేతితో దీపమెలిగించే జాతకులకు సానుకూల ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. ఇంకా గ్రహాధిపత్యంతో జాతకులు చేసే పూజతో ఆ గ్రహ ప్రభావంతో తలెత్తే కొన్ని అశుభ ఫలితాల నుంచి తప్పుకోవచ్చునని పండితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu