చిత్త నక్షత్రం మూడవ పాదములో జన్మించినవారైతే..?
, గురువారం, 6 డిశెంబరు 2012 (17:44 IST)
చిత్త నక్షత్రం మూడవ పాదములో జన్మించినవారైతే.. పుట్టిన మూడు సంవత్సరముల ఆరునెలల నుంచి కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. మూడు సంవత్సరాలు ఆరు నెలల నుంచి 21 సంవత్సరముల వరకు ఈ జాతకులకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించడం ఉత్తమం. 21
సం.లు 6 నెలల నుంచి 37 సంవత్సరముల ఆరు నెలల వరకు గురు మహర్దశ కావున కనకపుష్య రాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 37
సం.లు ఆరు నెలల నుంచి 56 సంవత్సరాల ఆరు నెలల వరకు శని మహర్దశ కావడంతో నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరమని, 56 సంవత్సరాల ఆరు నెలల నుంచి 73 సం,లు ఆరు నెలల వరకు బుధ మహర్దశ కావడంతో పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.