చంద్ర, కుజ గ్రహ దోషాలు తొలగిపోవాలంటే..?
సోమ, మంగళవారాల్లో పూజలు చేస్తే చంద్ర, కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. సోమవారం ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి.ఇక మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేయాలి. ఇలా చేస్తే చంద్రగ్రహ, కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.