కృత్తిక నక్షత్రమా? ఐతే బాల్యంలో ధనిక జీవితం గడుపుతారట!
కృత్తిక నక్షత్రములో పుట్టిన జాతకులు చదువు, అన్యభాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. రవి గ్రహ నక్షత్రమైన ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వమును కలిగి వుంటారు. అలాగే స్త్రీలతో విభేదాలు జీవితంలో చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే అవమానాన్ని ఏ మాత్రం సహించలేరు. ఇతరుల సలహాలను స్వీకరించరు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పరిశుభ్రతకు, వస్త్రధారణకు మంచి ప్రాముఖ్యతనిచ్చే ఈ జాతకులకు విశేషంగా దానం చేసే గుణం ఉంటుంది.ఇకపోతే.. కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు అదృష్ట సంఖ్యలు-9, 18, 27, 36, 45, 54, 63, 72. కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు కలిసొచ్చే రంగులు - ఎరుపు, తెలుపు. ఇదేవిధంగా కృత్తికా నక్షత్రము రెండు, మూడు, నాలుగు పాదాల్లో పుట్టిన జాతకులకు బుధవారం అనుకూలిస్తుంది. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక కృత్తికా నక్షత్రము రెండు, మూడు, నాలుగు పాదాల్లో పుట్టిన జాతకులకు నీలం, తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలపు, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలుంటాయి. అలాగే ఈ జాతకులకు ఆరు అనే సంఖ్య అన్నివిధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.