ఉత్తరాషాఢ నక్షత్రమా? ఐతే ప్రలోభాలకు లొంగరు
మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారా? అయితే స్వజనులతో ప్రేమగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. రవిగ్రహ నక్షత్రమైన ఈ ఉత్తరాషాఢలో పుట్టిన జాతకులు ప్రలోభాలకు ఏ మాత్రం లొంగరని వారు చెబుతున్నారు. దీంతో పాటు సాధారణ స్థాయి నుండి కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్షమందిలో ఒకరికి లభించే అరుదైన అవకాశం ఈ జాతకులకు భిస్తుంది. చదువు, విజ్ఞానంలో తల్లిదండ్రులకంటే మించిపోతారు. ఆర్థిక రహస్యాలు దాచుకోవడంలో వీరికి వీరే సాటి. తెలిసిన వాళ్ళకు అప్పకూడా ఇవ్వరు. స్నేహాలు, పరిచయాలు వినోదంగా భావిస్తారు. సెంటిమెంట్స్‌ను కీలక సమయంలో లెక్కచేయరు.మితంగా వ్యవహరించడం, ఇతరుల పట్ల వినయ విధేయతను కలిగి ఉండటం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నైజం. బంధుత్వ బంధానికి కట్టుబడి ఉంటారు. బంధువుల కోసం కొన్ని నిందలు తమపై వేసుకుని కష్టనష్టాలు అనుభవిస్తారు.ఇతరుల అభిప్రాయాలు ప్రచారాలు ఎంత కఠినంగా ఉన్నా స్వజనులకు అండగా నిలుస్తారు. సరైన సమయంలో నిజం చెప్పే అవకాశం వచ్చినా చెప్పరు. అయితే దానికి బలమైన కారణాలుంటాయి. ఇకపోతే.. రాహుదశ వీరికి అనుకూలిస్తుంది. పాలు, పాడి పంటలు, పూలతోటలకు సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. శీతలపానీయాలు, ఔషధ సంబంధమైన వ్యాపారాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. సంతానం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. ఇంకా.. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకు నలుపు, నీలం రంగులు అనుకూలిస్తాయి. వీరికి శనివారం అదృష్టమైన రోజు. అదేవిధంగా 4, 8 సంఖ్యలు కలిసివస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.