Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాభాద్ర నక్షత్రమా? వినయ, విధేయతలు వీరి సొంతం

Advertiesment
ఉత్తరాభాద్ర
WD
శనిగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు సలహాదారులుగా ఉంటారు. పెద్ద, చిన్న వయస్సు తారతమ్యాలను గమనించి మసలుకుంటారు. ఇంకా ఈ నక్షత్రములో జన్మించిన వారు ఇతరుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇతరుల సొమ్మును ఏ మాత్రం ఆశించని ఈ జాతకులకు, విదేశీ విద్యాభ్యాసం, అధికార పదవులు కలిసి వస్తాయి. ఇతర భాషలను సులభంగా నేర్చుకుంటారు. అసత్యాలు పలికి ఇతరులను మోసగించడం వీరికి రాదు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామిపై మితిమీరిన ప్రేమను కలిగి ఉంటారు.

ఎప్పటికీ చక్కని వ్యూహరచనతో పొదుపు సంసారాన్ని కొనసాగిస్తారు. ఇతరులకు అనవసరంగా రూపాయి ఖర్చు చేయరు. అన్ని విషయముల పట్ల అవగాహన కలిగి ఉండే వీరు హాస్యప్రియులుగా ఉంటారు. సంతానం వల్ల ప్రఖ్యాతి వస్తుంది.

ఇకపోతే... ఈ నక్షత్రములో జన్మించిన జాతకులు ప్రతి శనివారం శనిగ్రహాలను ప్రదక్షిణ చేసి నల్లటి ప్రమిదలో నల్లటి నువ్వులతో దీపమెలిగిస్తే ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్కులు అంటున్నారు. ఇంకా శనివారం పూట శివాలయానికి వెళ్లి నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu