Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టారా? ఐతే హాస్యప్రియులే..!

Advertiesment
ఉత్తరాభాద్ర నక్షత్రం
WD
ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు హాస్యప్రియులుగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే ఇతరుల కోసం అనవసరంగా ఒక్క పైసా ఖర్చు పెట్టరు. కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఎప్పటికీ చక్కని వూహ్యరచనతో పొదుపుచేయడంతో ఈ జాతకులకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

శనిగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు సలహాదారులుగా రాణిస్తారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రవర్తిస్తారు. ఇంకా ఈ నక్షత్రములో జన్మించిన వారు ఇతరుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

విదేశీ విద్యాభ్యాసం, అధికార పదవులు ఈ జాతకులకు కలిసి వస్తాయి. అన్య భాషలను సులభంగా నేర్చుకుంటారు. ఇతరుల అసత్యాలు పలికి ఇతరులను మోసగించడం వీరికి రాదు. సొమ్మును ఏ మాత్రం ఆశించని ఈ జాతకులకు, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామిపై మితిమీరిన ప్రేమను కలిగి ఉంటారు.

ఇకపోతే.. ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటిపాదంలో జన్మించిన జాతకులకు 3 అనే సంఖ్య అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఇంకా 3, 12, 21 అనే సంఖ్యలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే 5,6 అనే సంఖ్యలు ఈ జాతకులు ఏ మాత్రం కలిసిరావని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు నలుపు, తెలుపు, చిలకపచ్చ రంగులు కలిసివస్తాయి. ఇందులో నలుపు రంగు చేతి రుమాలును నిత్యం వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. అయితే ఆది, సోమ, మంగళ, గురు, శనివారాలు వీరికి అశుభ ఫలితాలనిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు.. ఉత్తరాభాద్ర 2,3,4 పాదాల్లో పుట్టిన జాతకులకు 4, 8, సంఖ్యలు అనుకూలిస్తాయి. 5, 6, 3, 7 అనే సంఖ్యలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ 1, 2, 9 సంఖ్యలు వీరికి ఏ మాత్రం కలిసిరావు. ఇక రంగుల విషయానికొస్తే.. నలుపు, నీలం రంగులు, శనివారం వీరికి శుభ ఫలితాలనిస్తాయి.

ఇదిలా ఉంటే... ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఈతిబాధలు తొలగిపోవాలంటే.. ప్రతి శనివారం శనీశ్వరునికి నువ్వులతో దీపమెలిగించాలని జ్యోతిష్యనిపుణులు అంటున్నారు.

అలాగే శనివారం పూట శివాలయంలోని శనీశ్వరునికి నువ్వుల నూనెతో తొమ్మిది వారాల పాటు దీపమెలిగించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. అలాగే శుక్రవారం పూట శివాలయానికి వెళ్లి నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu