Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆశ్లేష నక్షత్రమా? ఐతే కోరికలు ఎక్కువే..!

Advertiesment
ఆశ్లేష నక్షత్రం
WD
బుధగ్రహ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రములో జన్మించిన జాతకులు పట్టుదల, ప్రతీకారం స్పష్టమైన భావాలను కలిగి ఉంటారు. అంతేకాదు.. ఈ నక్షత్రములో జన్మించిన వారు వివిధ రకాల సౌఖ్యాలను కోరుకుంటారు. ఏదో విధంగా తమ కోరికలను తీర్చుకోగలుగుతారు.

అత్యున్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, కష్టపడి సుఖవంతమైన జీవితం ఏర్పరుచుకుంటారు. అయితే అపార్థాలు, అపోహల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. నమ్మకం లేని వ్యక్తుల తోటి సహజీవనం చేయాల్సి వస్తుంది. సంతానం, స్త్రీల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అర్హులైన వారికి దానం చేయడం, వివాదాస్పదమైన విషయాలను పట్టించుకోక పోవడం వీరి నైజం.

ఇకపోతే.. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఓర్పును ప్రదర్శిస్తారు. దీనికోసం ఎంతకాలమైనా వేచి ఉంటారు. నమ్మకద్రోహులు ఈ జాతకులకు స్నేహితులు కావడం దురదృష్టకరంగా పరిణమిస్తుంది. వయస్సు గడుస్తున్న కొద్ది సుఖవంతమైన జీవితానికి దగ్గరయ్యే ఆశ్లేష జాతకులకు... వస్త్ర వ్యాపారం, పాల వ్యాపారం, గనులు, పెట్రోల్ బంకులు, కాంట్రాక్టులు లాభిస్తాయి. అలాగే భూమి సంబంధిత వ్యాపారాలు వీరికి కలిసివస్తాయి.

ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు 2 లేదా 7 అదృష్ట సంఖ్యలు. అలాగే 2, 11, 20, 29. 38, 47 వంటి సంఖ్యలు కూడా వీరికి కలిసొస్తాయి. అయితే 4 మాత్రం వీరికి అశుభం. ఇంకా సిల్వర్, నీలం, క్రీమ్, తెలుపు రంగులు వీరికి శుభ ఫలితాలనిస్తాయి. ఇందులో తెలుపు రంగు చేతిరుమాలును తరచూ వాడటం మంచిది.

అలాగే.. సోమ, బుధ, ఆదివారాలు ఆశ్లేష నక్షత్ర జాతకులకు మంచి రోజులు. అయితే గురువారంలో మాత్రం ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu