ఆరుద్ర నక్షత్రమా? ఐతే అవమానాన్ని సహించలేరు
రాహుగ్రహ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు అవమానాన్ని ఏ మాత్రం సహించలేరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వాక్ చాతుర్యం, అద్భుతమైన హాస్య సంభాషణలు, జ్ఞాపకశక్తి మెండుగా కలిగి ఉండే ఈ జాతకులు వ్యాపార పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేగాకుండా.. ఈ జాతకులు ఇతరుల ఉన్నత స్థాయికి ఇటుక రాళ్ళవలె ఉపయోగపడుతారు. ఎలాంటి కార్యాన్నైనా పట్టుదలతో సాధించే ఆరుద్ర నక్షత్ర జాతకులకు కీర్తియోగం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. తప్పుడు సలహాలు, ప్రతీకార వాంఛ, పలుకుబడి వంటివి జీవితంలో కొన్ని ఒడిదుడుకులకు కారణమవుతాయి. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం ద్వారా చిక్కుల్లో పడతారు. తల్లిదండ్రుల వల్ల, సహోదరి, సహోదరుల పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉంటారు. రాత్రిపూట ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వీరి గుణం. ఎంతమంది వీరిని వీడి వెళ్ళినా, అసాధారణ తెలివితేటలతో సమాజంలో ఉన్నత స్థాయిని సాధిస్తారు. స్త్రీల గౌరవం పట్ల గౌరవం కలిగి ఉంటుంది. అయితే.. ఆర్థిక విషయాలపై ఆరుద్ర నక్షత్ర జాతకులు సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అందుచేత ఇబ్బందుల నుంచి బయటపడాలంటే.. బుధవారం పూట నవగ్రహ ప్రదక్షిణ చేసి, నేతితో దీపమెలిగించడం శ్రేయస్కరం. ఈ జాతకులు బుధవారం ఏ పనిని చేపట్టినా కలిసొస్తుంది. గురువారం సామాన్య ఫలితాలనిస్తుంది. అయితే సోమవారం నాడు మాత్రం ఈ జాతకులు ఎలాంటి పని చేపట్టకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పసుపు రంగు వీరికి కలిసొస్తుంది. ఎప్పుడూ పసుపు రంగు రుమాలును చేతిలో పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతకుల అదృష్ట సంఖ్య: 5.