Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం పుష్య అమావాస్య: పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు అర్ఘ్యమివ్వండి

Advertiesment
అమావాస్య
, సోమవారం, 4 ఫిబ్రవరి 2013 (16:41 IST)
FILE
మనదేశంలో గంగ, యమునా వంటి పుణ్య నదులు అనేకాలున్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. అమావాస్య రోజుల్లో ఇలాంటి పుణ్య నదుల్లో, పుణ్య తీర్థాల్లో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. అది ఎందుకో తెలుసా..

ముఖ్యంగా పితృదేవతలకు మహాలయ అమావాస్య, పుష్య అమావాస్య, ఆషాఢ అమావాస్య నాడు పూజలు, తర్పణాలిస్తే మంచి జరుగుతుంది. మనకు ఒక ఏడాది దేవతలకు ఒక రోజుగా పరిగణించబడుతోంది. ఇందులో ఆషాఢం నుంచి పుష్యమి వరకు దేవతలు రాత్రి సమయం.

ఈ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారని, ఆ సమయంలో మనల్ని పితృదేవతలు రక్షిస్తారని పండితులు అంటున్నారు. అలాగే పుష్యమి నుంచి ఆషాఢం వరకు దేవతలకు పగలు. అందుచేత ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు స్వాగతం పలికి, పుష్య అమావాస్య రోజున వీడ్కోలు ఇచ్చి పంపాలి.

అయితే పితృదేవతలు ఆడంబర పూజలు అవసరం లేదు. పితృదేవతలను పుణ్య తీర్థాల్లో అర్ఘ్యమివ్వాలి. ఎందుకంటే.. శ్రీహరి, లక్ష్మీదేవి సీతారాములుగా కాలిడిన రామేశ్వరం పుణ్యతీర్థమైంది. పార్వతీదేవి కన్యకాదేవిగా అవతరించిన ప్రదేశం కన్యాకుమారి. ఇలాంటి పుణ్యస్థలాల్లో పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం ద్వారా మన పాపాలు మాత్రమే తొలగిపోవడం కాకుండా.. వంశానికే మంచి జరుగుతుంది.

అలాగే అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చేయాలి. ఇలా చేస్తే సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే పూర్తి అమావాస్యలో శుభకార్యాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు అంటున్నారు. అందుచేత పుష్య అమావాస్య (ఫిబ్రవరి 10)నాడు పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి వారి అనుగ్రహం పొందండి.

Share this Story:

Follow Webdunia telugu