Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అశ్విని నక్షత్ర జాతకులు ప్రసన్న వదనులట..!

Advertiesment
అశ్విని నక్షత్రం
FILE
27 నక్షత్రముల యందు మొదటైన అశ్విని నక్షత్రం మేషరాశిలో స్థితమై యున్నది. మేషరాశితో ప్రారంభమయ్యే అశ్విని నక్షత్రంలో ప్రారంభమయ్యే జాతకులు సౌందర్యం కలవారుగా ఉంటారు.

తెలివి, జ్ఞాపకశక్తి, సామర్థ్యము, చైతన్యవంతమైన, విశాలమైన కళ్ళు కలిగివుంటారు. ఏ కార్యాన్నైనా బాగా ఆలోచించి సావకాశాముగా నిర్ణయం తీసుకునే ఈ జాతకుల స్వభావమును ఇతరులు అర్థం చేసుకోలేరు. ఎవరి నిర్భంధము, బలప్రయోగమును తావివ్వని స్థిరమైన దారుఢ్యము వీరిది.

అయితే తనను నమ్ముకున్న వారిని ఆపద సమయందు కాపాడుట వీరి విశిష్ట గుణము. ప్రసన్న వదనులైన ఈ జాతకులు ఎంతటి సంభ్రమ కార్యములు జరిగినను వీరి అతిశయోక్తి గల శాంతత వహించెదరు. మిత్రజన కార్యములందు అతివాదులుగా కనబడే ఈ జాతకులు ఆలోచన శక్తి కలవారు. ఒక్కొక్కప్పు యుక్తిగా మాట్లాడుతారు.

సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి ఎక్కువ. స్వతహాగా బుద్దీ బలము గల వీరు అనవసర కార్యముల గురించి ఆలోచించడం ద్వారా మనోసుఖమును తగ్గించుకుంటారు. ఈ జాతకులు పుట్టిన 30 సంవత్సరముల వరకు కష్టములు అధిగమించవలసి ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత అభివృద్ధి వుంటుంది.

ఇకపోతే.. అశ్వనీ నక్షత్ర జాతకులకు కృత్తిక, మృగశిర, పునర్వసు, చిత్త, అనూరాధన, జ్యేష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికి రావని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu