అనూరాధ నక్షత్ర జాతకులకు తండ్రి పద్ధతులు నచ్చవట..!
సూర్యుడు అధిదేవతగా, దేవగణ నక్షత్రమైన అనూరాధా నక్షత్రంలో పుట్టిన వారికి తండ్రి పద్ధతులు ఏ మాత్రం నచ్చవు. కానీ తల్లిపై వీరు అధిక ప్రేమను కలిగి ఉంటారు. సోదరీమణులపై ఆప్యాయతతో మెలిగే ఈ జాతకులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు. కానీ బంధువులు వీరికి ద్రోహం చేస్తారు. అందుచేత అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. స్వేచ్ఛగా జీవించాలనుకునే ఈ జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారని వారు చెబుతున్నారు. పెద్దల పట్ల గౌరవం, భక్తి భావాన్ని కలిగి ఉండే ఈ జాతకులు క్రీడల్లో రాణిస్తారు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కొంచమైనా ప్రేమ వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడతారు. వాహనాలు, గృహాలు, భూములకు సంబంధించిన వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. నిలకడగా ఉండే వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో స్థిరపడటం మంచిది. వైద్యవిద్యలో రాణిస్తారు. విదేశీయానము, దూరప్రాంతాల్లో ఉద్యోగం వీరికి కలిసి వస్తుంది. ఎందరూ ఆత్మీయులు ఉన్నా, ఏకాంతంగా జీవితాన్ని గడిపే సందర్భాలే వీరికి ఎక్కువ. ఇతరులకు సలహాలు చెప్పి వారి పురోగతికి దోహదపడతారు. వేదాంతం, ఆధ్యాత్మికంలో పట్టు ఎక్కువ. ఒకసారి లాభాలు పొందిన రంగంలో తిరిగి ప్రవేశించడంపై మక్కువ చూపరు. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు చేరువవుతాయి. ప్రతి రంగాన్ని అభ్యిసించి అధికార పదవులను అలంకరిస్తారు.అదృష్ట రంగులు : అనూరాధ నక్షత్రంలో పుట్టిన జాతకులకు పసుపు, నలుపు రంగులు అనుకూలిస్తాయి. అదృష్ట సంఖ్యలు : 9, 18, 36 అనే సంఖ్యలు శుభ ఫలితాలనిస్తాయి. కానీ 1, 2, 3 అనుకూలించవు. కానీ 6,8 సామాన్య ఫలితాలను నిస్తాయి. 4, 5, 6 అశుభ ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే.. అనూరాధ నక్షత్రంలో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే బుధ, సోమ వారాలు శుభం. ఆదివారం ధనలాభం చేకూరుతుంది.