Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాటి మనిషికి సాయమే 'సాయి' తత్వం... పిలుపునిచ్చిన 2 గంటల్లోనే...

సౌత్ ప్లైన్ఫీల్డ్ : సాటి మనిషిలోనే దేవుడిని చూడమని చెప్పిన ఆ షిరిడీ నాధుడి బాటలోనే న్యూజెర్సీ సాయి దత్తపీఠం అడుగులు వేస్తోంది. సాయి చెప్పిన సేవా మార్గాన్ని తు.చ తప్పకుండా పాటిస్తోంది. ఈ క్రమంలోనే అనాధ పిల్లలకు చేయూత అందించేందుకు సాయిదత్త పీఠం సాయి భక

Advertiesment
సాటి మనిషికి సాయమే 'సాయి' తత్వం... పిలుపునిచ్చిన 2 గంటల్లోనే...
, శనివారం, 21 అక్టోబరు 2017 (14:23 IST)
సౌత్ ప్లైన్ఫీల్డ్ : సాటి మనిషిలోనే దేవుడిని చూడమని చెప్పిన ఆ షిరిడీ నాధుడి బాటలోనే న్యూజెర్సీ సాయి దత్తపీఠం అడుగులు వేస్తోంది. సాయి చెప్పిన సేవా మార్గాన్ని తు.చ తప్పకుండా పాటిస్తోంది. ఈ క్రమంలోనే అనాధ పిల్లలకు చేయూత అందించేందుకు సాయిదత్త పీఠం సాయి భక్తులకు పిలుపునిచ్చింది.
 
భారతదేశంలో అనాధ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు తమదైన సాయం చేయాలని తలంచిన సాయిదత్త పీఠం పిలుపునిచ్చిన కేవలం 2 గంటల వ్యవధిలో భక్తులకు తమకు తోచిన సాయం చేయాలనే సేవా మార్గం వైపు నడిపిస్తోంది.
 
సాయిదత్త పీఠం నుంచి ఆ విరాళాలను అనాధ పిల్లల జీవితాల్లో కాంతులు నింపేందుకు వినియోగించనున్నారు. ఈ విరాళాల సేకరణలో స్థానిక ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు శ్రీమతి బబిత, రమలు కీలక పాత్ర పోషించారు. ఓవర్సీస్ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా(OVBI) కొరకు ఈ నిధుల సేకరణ చేపట్టారు.
webdunia
 
ఈ క్రమంలోనే 1,400 డాలర్లను మహిళా సాయి భక్తులు విరాళాలుగా సేకరించారు. ఇక నుంచి తాము ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఇతోధిక సాయం చేయడంలో ముందుంటామని సాయిదత్త పీఠం నిర్వహకులు బ్రహ్మశ్రీ రఘు శర్మ శంకరమంచి తెలిపారు. సాటి మనిషికి సాయం అందించడమే సాయి తత్వమని.. ఈ మార్గంలోనే సాయిదత్త పీఠానికి వచ్చే భక్తులు నడవడం ఆనందంగా ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే.. ఎండు ద్రాక్షలను?