Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో వాకథాన్

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో, NATS మహిళా సంబరాల్లో భాగంగా, దక్షిణ కాలిఫోర్నియాలోని రెండు ప్రాంతాలలో (Cerritos, Oak Park) ఫిబ్రవరి 24, 2018న 5k వాకథాన్ కార్యక్రమం నూతన లాస్ ఏంజెల్స్ చాప్టర్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.

Advertiesment
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో వాకథాన్
, మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:01 IST)
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో, NATS మహిళా సంబరాల్లో భాగంగా, దక్షిణ కాలిఫోర్నియాలోని  రెండు ప్రాంతాలలో (Cerritos, Oak Park) ఫిబ్రవరి 24, 2018న 5k వాకథాన్ కార్యక్రమం నూతన లాస్ ఏంజెల్స్ చాప్టర్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
 
Cerritos Regional Parkలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ప్రముఖ సినీ నటి శ్రీమతి లయ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన NATS వాలంటీర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసారు.
 
ఫ్లోరిడాలో జరిగిన విధ్వంసకాండలో బలి అయిన పిల్లలని గుర్తుచేసుకుంటూ రెండు నిమిషములు మౌనం పాటించారు. శ్రీమతి లయ ఈ సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ, పిల్లల జీవితంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలని, వారితో స్నేహితులుగా మెలగాలని, అందరూ పిల్లల భవిష్యత్తు కొరకు పాటుపడాలని పిలుపునిచ్చారు. 250 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా శ్రేయస్సు కోసం నాట్స్ చేస్తున్న ప్రయత్నాన్ని మరింతగా బలపరచాలని NATS మహిళా కార్యకర్తలు శిరీష పొట్లూరి, నీలిమ యాదల్లా, అనితా కొంక మరియు అనితా కాట్రగడ్డ పిలుపునిచ్చారు.
  
ఈ కార్యక్రమానికి కృషి చేసిన కార్యకర్తలను నాట్స్ లాస్ ఏంజెల్స్ కో-ఆర్డినేటర్ కిషోర్ బూదరాజు, కార్యదర్శి శ్రీనివాస్ చిలుకూరి, ఉమ్మడి కార్యదర్శి మనోహర్ మద్దినేని, కోశాధికారి గురు కొంక ధన్యవాదములు తెలిపారు. March 10వ తారీఖున జరిగే మహిళా సంబరాలను వినూత్నంగా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు పౌరులకు అందిస్తామాని తెలిపారు. ఈ సందర్భంగా దక్షిణ కాలిఫోర్నియాలో నివాసముంటున్న తెలుగువారిని అందరిని ఆహ్వానించారు. శ్రీమతి పూనమ్ మాలకొండయ్య, శ్రావ్య కళ్యాణపు, లయ గొర్తి మరియు షెరిల్ స్పిల్లెర్‌లు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలియచేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీకాకాయతో ఆరోగ్య ప్రయోజనాలు... ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...