Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెయింట్ లూయిస్‌లో నిరాశ్రయులకు నాట్స్ చేయూత

Advertiesment
సెయింట్ లూయిస్‌లో నిరాశ్రయులకు నాట్స్ చేయూత
, మంగళవారం, 2 జూన్ 2020 (20:35 IST)
అమెరికాలో కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమవుతున్న పేదలకు చేయూత అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌లో నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఏడు నిరాశ్రయ సంస్థల్లో ఉంటున్న నిరాశ్రయులకు ఆహారం అందించింది. దాదాపు 300 మందికి ఇలా నాట్స్ ఆహార పంపిణీ చేసింది.
 
నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ నేషనల్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ సమన్వయకర్త నాగశ్రీనివాస్ శిష్ట్లా, అప్పలనాయుడు గండి, వైఎస్ఆర్‌కె ప్రసాద్, సురేశ్ శ్రీరామినేని, ఆదిత్య శ్రీరామినేని, నాగ సతీశ్ ముమ్మనగండి, నరేశ్ చింతనిప్పు, శ్రీని తోటపల్లి, రమేశ్ అత్వాల, అమేయ పేట్, రఘు పాతూరి, అంబరీష్ అయినగండ్ల తదితరులు ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
సుధీర్ అట్లూరి ఈ పంపిణీ తనవంతు సహకారం అందించారు. కమల్ జాగర్లమూడి, శ్రీనివాస్ మంచికలపూడి పెద్దలకు ఆహారానికి అయ్యే ఖర్చును భరిస్తే.. అరుణ్ కొడాలి పిల్లల ఆహారానికి అయ్యే ఖర్చును భరించి తమ మానవత చాటుకున్నారు. బావర్చి రెస్టారెంట్‌కు చెందిన హరి గరిమెళ్ల ఈ ఆహారతాయరీకి తన వంతు సాయం చేశారు. సిక్క్స్ ఆఫ్  ఎస్టీల్ ఈ ఆహారాన్ని పంపిణీ చేయడంలో తోడ్పాటు అందించింది.
 
ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ నాట్స్ సంస్థ రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు మిగతా నాట్స్ చాఫ్టర్స్ లోనూ చేయనుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేగుల్లోని వ్యర్థాలను సులభంగా తొలగించాలంటే..?