Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

Advertiesment
image

ఐవీఆర్

, శనివారం, 15 మార్చి 2025 (23:52 IST)
విజయవాడ: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలను నాట్స్ టీం ఆహ్వానించింది. టంపా వేదికగా జూలై 4, 5, 6 తేదీల్లో జరగనున్న 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అమెరికాలో తెలుగువారందరూ కలిసి చేసుకునే పండుగ అమెరికా తెలుగు సంబరాలని.. ఈ సంబరాల్లో పాలుపంచుకుంటే తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని నాట్స్ బృందం సభ్యులు చంద్రబాబును అభ్యర్థించారు.
 
సంబరాల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి నాట్స్ బృందం చంద్రబాబుకు వివరించింది. ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాట్స్ సంబరాలకు విచ్చేస్తే తెలుగు వారి ఐక్యత ను ప్రతిబింబించనట్టు ఉంటుందని నాట్స్ బృందం తెలిపింది.

ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి  నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు  పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?