Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిటెక్ విద్యార్థిని ఆప‌రేష‌న్‌కు నాట్స్ ఆర్థిక స‌హాయం

Advertiesment
NATS helping hand to betch girl for her treatment
, బుధవారం, 30 మార్చి 2016 (17:21 IST)
ఒక బిటెక్ విద్యార్థిని ఆప‌రేష‌న్‌కు నాట్స్ ఆర్ధిక స‌హాయం అందించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మి నగర్‌కు చెందిన బి.టెక్ చదువుతున్న కె .పూజిత ప్రమాదం బారిన పడింది. ఆమెకు ఆపరేషన్ చెయ్యడానికి సుమారుగా రూ.9,50,000 అవసరం. కాని పూజిత కుటుంబం బాగా వెనుకబడిన కార‌ణంగా వీరికి అంత స్తోమత లేదు.
 
ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్),  ప్రవాసాంధ్రులు కలిసి పూజిత హాస్పిటల్ ఖర్చులు కోసం  రూ.9,50,000 సమీకరించారు. ఆ మొత్తం సొమ్మును ఇండియాలోని గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ ద్వారా రవీంద్రనాథ్ జిఇ మెడికల్ అసోసియేషన్ వారికి సభాపతి డా. కోడెల శివ ప్రసాద రావు చేతుల మీదుగా మంగళవారం అందించారు. 
 
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి అచ్చె నాయుడు, గౌతు శివాజీ, నాట్స్ ఇండియా కో-ఆర్డినేటర్ రతీష్ అడుసుమిల్లి, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ ( గ్లో ) జనరల్ సెక్రటరీ వై. వెంకన్నచౌదరి, పూజిత తల్లి కళ్యాణి, సోదరుడు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu