Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెయింట్ లూయిస్‌‌లో తెలుగుదేశం ఆత్మీయ సమావేశం, ఏపీ కోసం ప్రవాసాంధ్రులు ఆలోచించాలి: దూళిపాళ్ల

Advertiesment
NTR
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావడం తప్పనిసరి అని తెలుగుదేశం సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరుకునే ప్రతి ప్రవాసాంధ్రుడు ఈ విషయంలో టీడీపీ కి తమ మద్దతు అందించాలని ఆయన కోరారు. సెయింట్ లూయిస్‌లో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో దూళిపాళ్ల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు సంఘం నాయకులు శ్రీనివాస్ మంచికలపూడి ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.  

 
దూళిపాళ్ల నరేంద్ర లాంటి  సమర్ధులైన నాయకులు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచికలపూడి తెలిపారు. ఈ సమావేశానికి నాగశ్రీనివాస్ శిష్ట్లా వ్యాఖ్యతగా వ్యవహరించారు.

 
దండమూడి రాజేంద్రప్రసాద్, దర్శి బాబ్జీ, రమేశ్ బెల్లం లాంటి ప్రవాసాంధ్ర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాజ రామారావు, బాబు దండమూడిలతో పాటు తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో దూళిపాళ్ల నరేంద్రను సన్మానించారు. ఈ సమావేశం విజయవంత కావడంలో సురేశ్ శ్రీరామినేని, సురేంద్రబాచిన, అప్పలనాయుడు గండి, గోపినాథ్ సోంపల్లి, శ్రీనివాస్ అట్లూరి, జగన్ వేజండ్ల, సురేంద్ర బైరపనేని, రామకృష్ణ వీరవల్లి, శివ జాస్తి, సందీప్ ముప్పవరపు, నాగశ్రీనివాస్ శిష్ట్లా, రాజశేఖర్ ఓలేటి, డా. సుధీర్ అట్లూరి, సందీప్ గంగవరపు, శివ జాస్తి, ప్రదీప్ గవిర్నేని, రమేశ్ బెల్లం, శ్రీనివాస్ మంచికలపూడి తదితరులు కీలక పాత్ర పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్రబెండకాయ గురించి మీకు తెలుసా?