Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘనంగా "దీం"తాన 20వ ద్వైవార్షిక మహాసభలు..!

ఘనంగా
, బుధవారం, 13 మే 2015 (20:45 IST)
ప్రతి రెండు సంవత్సరాలకు జరుపుకొనే తానా వేడుకలకు ముందు జరిగే "దీం"తాన సంగీత, నృత్య పోటీలు, బ్యూటీ ప్రెజెంట్ అమెరికాలోని హోస్టన్ నగర వాసులు స్థానిక మీనాక్షి దేవాలయ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ పోటీలలో దాదాపు 50 మంది పిల్లలు, పెద్దలు మూడు విభాగాలలో పోటీ చేశారు. పాటల విభాగంలో కర్ణాటక సంగీతం, సినిమా పోటీలు జరుగగా, డ్యాన్స్ విభాగంలో శాస్త్రీయ నృత్యం, బాలీవుడ్ పోటీలు జరిగాయి. 
 
ఇవేకాక టీన్ 'దీం'తాన, 'మిస్'తాన, 'మిస్సెస్'తానాలు ఆహూతులను కనువిందు చేశాయి. ఈ కార్యక్రమం సంప్రదాయం ప్రకారం 'దీం'తాన సలహాదారు, హ్యూస్టన్ టీం లీడ్ శారద ఆకునురి, హ్యూస్టన్ టీం కార్యవర్గ సభ్యులు గోపాల గూడపాటి, రఘు నేద్నూరు, కృష్ణ కీర్తి, సుధీర్ మెంట, శ్రీనివాస్ గుమ్మడి జ్యోతి ప్రజ్వలన చేయగా, శారద ఆకురూరి గణపతి ప్రార్థనతో ప్రారంభమయింది.
 
ఈ కార్యక్రమానికి శ్రీమతి నందిత పర్వతనేని ముఖ్యఅతిథిగా విచ్చేసి బ్యూటీ ప్రెజెంట్ న్యాయనిర్ణేతగా వ్యవహించారు. చంద్రకాంత, డేవిడ్ కోర్టిస్, రవి సంగీత, నృత్య పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. స్థానిక సంగీత నృత్య కళాశాలల నుండి మాత్రమే కాక హోస్టన్‌లోని నలుమూలల నుండి వచ్చిన కళాకారుల శాస్త్రీయ నృత్యాలు, సినీ నృత్యాలు, రస హృదయులైన ప్రేక్షకులను ఎంతో అలరించగా, కర్ణాటక సంగీతం, చిత్ర గీతాలు ఆహూతులను ఆకట్టుకోగా, అందరిని ఆరు గంటలపాటు ఆనందింపజేశారు.
webdunia
 
పోటీలలో పాల్గొని గెలిచిన విజేతలకు బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెడికల్ మరియు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. టీన్ తానా, మిస్ తానాలకు ముఖ్య అతిథి శ్రీమతి నందిత పర్వతనేని కిరీటంతో అలంకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు రాజ్ పసల వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

శారద ఆకునూరి మాట్లాడుతూ విజేతలను, హోస్టన్ తెలుగు వారందరినీ డిట్రాయిట్‌లో జరుగబోతున్న తానా 20 ద్వైవార్షిక మహాసభలకు విచ్చేసి జయప్రదం చెయ్యాల్సిందిగా కోరారు. విజేతల వివరాలు...
webdunia

Share this Story:

Follow Webdunia telugu