Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ యూత్ కమిటీ... ఎనర్జటిక్ ఈవెంట్స్

జులై నెలలో 8 నుంచి 10వ తేదీల మధ్య అమెరికా తెలంగాణ అసోసియేషన్ మహాసభలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎటిఎ యూత్ కమిటీ మూడు ఎనర్జిటిక్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. మిల్లేనియల్ మిక్సర్... అంతా వినోదమే. సాయంత్రం 3.30 గంటల నుంచి 6 గంటల వరకూ పాత స్

Advertiesment
American Telangana Association
, మంగళవారం, 28 జూన్ 2016 (15:47 IST)
జులై నెలలో 8 నుంచి 10వ తేదీల మధ్య అమెరికా తెలంగాణ అసోసియేషన్ మహాసభలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎటిఎ యూత్ కమిటీ మూడు ఎనర్జిటిక్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. 
 
మిల్లేనియల్ మిక్సర్... అంతా వినోదమే. సాయంత్రం 3.30 గంటల నుంచి 6 గంటల వరకూ  పాత స్నేహితులతో పరిచయ కార్యక్రమం. డీజె మిక్స్టా ట్రాక్స్ ప్రోగ్రాంలో 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్నవారు పాల్గొనవచ్చు. దీనికి ఉచిత రిజిస్ట్రేషన్, ఐతే ఎంట్రన్స్ ఫీజు కూడా నామమాత్రమైనదే. ఇక డ్రెస్ కోడ్ గురించి... ఫార్మల్/ఆకట్టుకునే వస్త్రధారణ.
 
ప్యారడైజ్ పార్క్ లాక్-ఇన్: క్రీడా సంబరాలు. రాక్ క్లైంబింగ్, మినీ గోల్ఫ్, ఆర్కేడ్ గేమ్స్ తదితర ఆటలు. ఉదయం 12 గంటల నుంచి 5 గంటల వరకూ. ఈ క్రీడలు సురక్షితమైనవే కాబట్టి రాత్రంతా స్వేచ్చగా ఆడేయవచ్చు. దీనిద్వారా కొత్త స్నేహాలకు అవకాశం కూడా. ఎంట్రన్స్ ఫీజు ఉచితమే. ఐతే మొదటి 200 రిజిస్ట్రేషన్లకు 30 డాలర్లు. 
 
టీ టైమ్ డిస్కషన్స్... స్నేహితుల పరస్పర చర్చలు. పెద్దలు, యువత ఒక్కచోట చేరి చర్చించుకునే కార్యక్రమం. ఇందులో డేటింగ్, వివాహం, అకడమిక్స్ సంబంధ విషయాలన్నీ చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎటిఏ కన్వెన్షన్ వెబ్ సైట్ ను వీక్షించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాకాహారులు ఆరగించే ప్రతి ఆహార పదార్థం మాసాహారంతోనే తయారైనవే.. తెలుసుకోండి?